Advertisementt

రామ్‌చరణ్‌తో పోటీ పడేది ఎవరు..?

Fri 09th Oct 2015 09:05 AM
ram charan,thani oruvan,villain character,madhavan  రామ్‌చరణ్‌తో పోటీ పడేది ఎవరు..?
రామ్‌చరణ్‌తో పోటీ పడేది ఎవరు..?
Advertisement
Ads by CJ

త్వరలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళంలో అద్భుత విజయం సాధించిన తని ఒరువన్‌ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమిళ సినిమాలో కూల్‌ విలన్‌గా నటించిన అరవింద్‌స్వామికి ఎంతో పేరు వచ్చింది. ఈ పాత్రకు తెలుగులో ఇప్పటికే రానా, నాగార్జున పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ దీనిని నాగ్‌ ఖండించాడు. తాజాగా ఈ పాత్రను హీరో మాధవన్‌ చేత చేయించడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రన్‌, సఖి, చెలి వంటి పలు ప్రేమకథా చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మాధవన్‌కు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఈ వార్తే నిజమైతే చాలా కాలం తర్వాత మరలా మాధవన్‌ తెలుగు ప్రేక్షకులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మాధవన్‌ నిర్ణయం ఏమిటనేది? తెలిసిపోతుందని టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ