ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ పోతే.. ఏ టెన్షన్ వుండదు.ఈ సూత్రాన్ని కథానాయకుడు నితిన్ అచ్చంగా పాటిస్తాడట. అందుకే కాబోలు నితిన్ తన సినిమాలు ముహుర్తం జరుపుకోని ఆగిపోయినా పెద్దగా పటించుకోడు. అంతేకాదు ఇలా ఆగిపోవడం కూడా నితిన్‌కే కలిసొస్తుంది. రామ్ హీరోగా రూపొందిన శివమ్ ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. కాగా మొదట్లో నితిన్‌తో ఈ సినిమాను మొదలుపెట్టి ఆపేశాడు సదరు దర్శకుడు శ్రీనివాస రెడ్డి. నితిన్ కథలో మార్పులు సూచించడంతో అది నచ్చని దర్శకుడు అదే కథతో రామ్‌తో శివమ్ చేశాడు. ఇప్పుడు ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో నితిన్ హ్యాపీగా వున్నాడట. అంతేకాదు పూరి జగన్నాథ్‌తో కూడా నితిన్ సినిమా అనౌన్స్ చేసి క్యాన్సల్ అవ్వడం.. ఆ ప్లేస్‌తో త్రివిక్రమ్‌తో సినిమా రావడం...నితిన్‌కు కలిసొచ్చినట్లే కదా... ఎంతైనా నితిన్‌కు ఎక్కడో సుడి వుందని అంటున్నారు సినీజనాలు.