Advertisementt

రామ్‌చరణ్‌ కోరిక తీరనుంది..!

Thu 08th Oct 2015 10:34 PM
ram charan,brucelee movie,over sees,sreenuvaitla  రామ్‌చరణ్‌ కోరిక తీరనుంది..!
రామ్‌చరణ్‌ కోరిక తీరనుంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా మాస్‌లో ఆయన క్రేజ్‌ మరీ ఎక్కువ. అయితే ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను బాగా ఆదరించే ఓవర్‌సీస్‌లో రామ్‌చరణ్‌ హిట్టు సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే బ్రూస్‌లీ చిత్రంతో చరణ్‌ ఓవర్‌సీస్‌ను కూడా కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నాయి. యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను అద్బుతంగా తీసే దర్శకుడు శ్రీనువైట్లకు ఓవర్‌సీస్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇక ఆయనతో మరోసారి కోనవెంకట్‌, గోపీమోహన్‌లు కలిసి పనిచేస్తుండటం, చిరంజీవి గెస్ట్‌ అప్పీరియన్స్‌ ఇస్తుండటం వల్ల ఈసారి ఎలాగైనా రామ్‌చరణ్‌ ఓవర్‌సీస్‌లో కూడా తన హవా చాటుకుంటాడని, మిలియన్‌ క్లబ్బులో చోటు సంపాదించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ చిత్రం విడుదల సందర్బంగా ఓవర్‌సీస్‌లో కూడా భారీగా ప్రీమియర్‌ షోలు, రెగ్యులర్‌ షోలను ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. మరి ఈ చిత్రమైనా రామ్‌చరణ్‌ కోరికను తీర్చేనా...? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ