శ్రీమంతుడులాంటి గ్రాండ్ హిట్‌తో మంచి ఉత్సాహంగా వున్న మహేష్ ప్రస్తుతం బ్రహ్మూెత్సవం షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌లో 3 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన సెట్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా సంగీత్ సాంగ్‌ని చిత్రీకరించారు. నెక్స్‌ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా వుండగా, ఈ సినిమా తర్వాత మహేష్ చెయ్యబోయే సినిమా ఏమిటనేది నిన్న మొన్నటి వరకు సస్పెన్స్‌గా వుండేది. కానీ, బ్రహోత్సవం తర్వాత మహేష్ చెయ్యబోయే సినిమా ఏమిటనే క్వశ్చన్‌కి ఆన్సర్ దొరికేసింది. అతని నెక్స్‌ట్ మూవీ తమిళ్ టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్‌తో చెయ్యబోతున్నాడు. మురుగదాస్‌తో మహేష్ సినిమా చెయ్యబోతున్నాడన్న వార్త గతంలోనే వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయిపోయిందని మహేష్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మహేష్‌తో సినిమా చెయ్యడానికి వినాయక్, పూరి, త్రివిక్రమ్ లైన్‌లో వున్నప్పటికీ వీరిని కాదని మురుగదాస్‌తోనే సినిమా చెయ్యడానికి మహేష్ మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. బ్రహ్మూెత్సవం చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చెయ్యాలన్నది దర్శకనిర్మాతల ఆలోచన. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మురుగదాస్ చిత్రం స్టార్ట్ అవుతుందని, ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రావాల్సి వుంది.