గతకొంతకాలంగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో2 చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై ఇప్పటివరకు శంకర్ నోరు విప్పలేదు. రజనీకాంత్ ప్రస్తుతం చేస్తున్న కబాలి చిత్రం పూర్తయిన వెంటనే అంటే డిసెంబర్ నుండి ఈ రోబో2లు మొదలుకానుందని ప్రచారం జరుగుతోంది. హీరోగా రజనీకాంత్‌ను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఈ చిత్రంలో విలన్ పాత్రకు మాత్రం పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. విలన్‌గా విక్రమ్ చేయనున్నాడని, కాదు..కాదు.. షారుక్‌ఖాన్ విలన్‌గా నటించనున్నాడని రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌గా హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ చేయనున్నాడనే వార్త వ్యాపించింది. ఈ చిత్రంలో నటిస్తానని ఐ ఆడియో వేడుక సందర్బంగానే అర్నాల్డ్ శంకర్‌కు మాట ఇచ్చాడని, ఈ పాత్ర చేయడం కోసం ఆయన 100కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని 300కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా అర్నాల్డ్‌తో శంకర్‌తో పాటు లైకా ప్రొడక్షన్ సంస్థ అధినేతలు కూడా చర్చలు జరుపుతున్నారట. అర్నాల్డ్ కనుక నటిస్తే ఈ చిత్రానికి హాలీవుడ్ క్రేజ్ తప్పక వస్తుంది. మరి చివరకు రజనీకి ప్రత్యర్థి ఎవరో? త్వరలో తేలనుంది.