స్టార్‌హీరోల సినిమాల ఆడియో రైట్స్ కోసం ఆడియో కంపెనీలు, ఆయా ఆడియో వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయడానికి టీవీ చానెల్స్ కూడా ఎగబడుతున్నాయి. భారీ రేట్లకు లైవ్ టెలికాస్ట్ హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. టాప్‌సార్స్ సినిమాలకు ప్రముఖ టీవీ చానెళ్ల నుండి పోటీ ఏర్పడుతోంది. దాదాపు 70 లక్షల నుండి కోటి రూపాయల వరకు రైట్స్ కొనుక్కొంటున్నాయి. స్టార్స్ ఆ ఫంక్షన్లకు వస్తే టీఆర్పీ రేటింగ్‌లు వల్ల భారీ ఆదాయాలు వస్తాయని టీవీ చానెళ్ల నమ్మకం. ఆ లెక్కతోనే జీ తెలుగు చానెల్ రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ ఆడియో వేడుకల రైట్స్‌ని 70లక్షలకు కొనుగోలు చేసింది. రామ్‌చరణ్, చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ కార్యక్రమానికి వస్తారని, దాంతో జనాలు టీవీలకు అతుక్కుపోతారని జీ తెలుగు యాజమాన్యం భావించింది. అయితే అదే రోజు భారత్-సౌతాఫ్రికా టీ 20 మ్యాచ్ ఉండటంతో అభిమానులెవ్వరూ బ్రూస్‌లీ ఆడియో వేడుకపై పెద్దగా శ్రద్ద పెట్టలేకపోయారు. దీంతో టీఆర్పీ రేటింగ్స్ అనుకున్నంతగా రాలేదు. దాంతో జీతెలుగు భారీగానే నష్టపోయిందని టాక్.