త్వరలో మాస్‌మహారాజా రవితేజ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఎవడో ఒకడు అనే టైటిల్ పెడతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా దిల్‌రాజు ఫిల్మ్‌చాంబర్‌లో బోగి (ఆనందంగా ఉండేవాడు) అనే ట్యాగ్‌లైన్‌తో ఓ టైటిల్‌ను రిజిష్టర్ చేయించాడు. ఈ టైటిల్‌ను కూడా రవితేజ సినిమాను ఉద్దేశించే రిజిష్టర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. మరి ఎవడో ఒకడు, బోగి టైటిల్స్‌లో రవితేజ సినిమాకు ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దిల్‌రాజు అయినా తనకు భద్ర వంటి హిట్‌ను అందిస్తాడనే ఆశతో రవితేజ ఉన్నట్లు తెలుస్తోంది.