బాహుబలి పార్ట్1 వచ్చి చాలారోజులైంది. ఈ చిత్రం దేశవిదేశాల్లో దాదాపు 600కోట్లు కొల్లగొట్టింది. అయినా కూడా ఇప్పటికీ రాజమౌళి తన బాహుబలి1ను ఇంకా వదలలేదు. విడుదలై మూడు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఈ చిత్రానికి అంతర్జాతీయంగా విడుదల చేసే పనుల్లోనే బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని బూసాన్ ఫిలిం పెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జపాన్‌కు చెందిన ట్విన్‌కో అనే సంస్థ ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేసేందుకు రైట్స్ తీసుకొంది. ఇక మరో పెద్ద నిర్మాణ సంస్థ చైనా హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను లాటిన్ అమెరికా, కొరియా, యూరప్ వంటి దేశాల్లో కూడా ప్రదర్శించడానికి రాజమౌళి అండ్ టీం అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారంతో వివిధ భాషల్లోకి తర్జుమా చేస్తోంది. మరి మొత్తానికి రాజమౌళి మాత్రం బాహుబలి పార్ట్1ను 1000కోట్ల దిశగా నడిపించేందుకు ఇంకా బిజీ బిజీగానే ఉన్నాడు. దాంతో ఈ చిత్రం రెండో పార్ట్ షూటింగ్ మొదలుకావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మహేష్‌బాబుకు బిజినెస్‌మెన్ అనే టైటిల్‌ను పెట్టారు కానీ.. నిజమైన బిజినెస్‌మెన్ అంటే మాత్రం జక్కన్నే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.