Advertisementt

క్రెడిట్‌ ఎవరిది? అనే విషయంలో క్లారిటీ..!

Tue 06th Oct 2015 11:50 AM
gunasekhar,rudhramadevi,allu arjun,anushka  క్రెడిట్‌ ఎవరిది? అనే విషయంలో క్లారిటీ..!
క్రెడిట్‌ ఎవరిది? అనే విషయంలో క్లారిటీ..!
Advertisement
Ads by CJ

రుద్రమదేవి సూపర్‌హిట్‌ అయితే ఆ క్రెడిట్‌ ఎవరిది? ఆ విజయానికి కారణం ఎవరు? ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఆ క్రెడిట్‌ మొత్తం అనుష్కదే.. అని అల్లుఅర్జున్‌ క్లారిటీ ఇచ్చాడు. ఈ నెల 9న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం విషయంలో బన్నీ అనుష్కని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ పాత్రను అనుష్క తప్ప మరెవరు పోషించలేరని, అనుష్కలా మరో అమ్మాయి ఉన్నా... ఈ సాహసం చేయలేరు. ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడింది. మాకంటే ఎక్కువగా శ్రమించింది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు కూడా కోట్లు వెచ్చించి సినిమా చేయగలమనే నమ్మకాన్ని కలిగించింది. అందుకే ఈ సినిమా హిట్టయితే ఆ క్రెడిట్‌ మొత్తం అనుష్కకే ఇవ్వాలి.. అంటూ బన్నీ వ్యాఖ్యానించాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన వాదన తప్పు అని చెప్పవచ్చు. అనుష్క ఎంత కష్టపడినప్పటికీ తానే నిర్మాతగా మారి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి, ఎన్నో అవరోధాలు ఎదుర్కొని నిర్మాత అండ్‌ డైరెక్టర్‌గా ఇంతటి సాహసం చేసిన గుణశేఖర్‌కే ఈ క్రెడిట్‌ చెందాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ