గుణశేఖర్ తీస్తున్న రుద్రమదేవిలో ఎందరో హేమాహేమీలైన నటీనటులు ఉన్నారు. అనుష్క, అల్లుఅర్జున్, రానా, నిత్యామీనన్, కృష్ణంరాజు.. ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్ట్ తయారవుతుంది. ఇక తెర వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఆయన ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే. రుద్రమదేవిలో చిరు ఎంట్రీకి కారణం ఎవరు? అంటే బన్నీ అనే చెప్పాలి. రుద్రమదేవి కథని పరిచయం చేయడానికి ఓ గంభీరమైన గొంతు కావాలని గుణశేఖర్ అన్వేషిస్తున్న తరుణంలో గుణశేఖర్‌కి చిరు పేరు సూచించింది బన్నీనే. ఈ విషయాన్ని గుణశేఖర్ కూడా ఒప్పుకున్నాడు. చిరుగారి గొంతైతే బాగుంటుంది అని బన్నీ చెప్పాడు.నాక్కూడా అదే మంచి ఆలోచన అనిపించింది. దాంతో చిరంజీవి గారిని కలిసి అడిగాను. ఆయన నాతో ఎలా కావాలంటే అలా వాడుకో.. అని ప్రోత్సహించారు. ఈ చిత్రానికి ఆయన గొంతు ఈ చిత్రానికి ఓ మణిహారంలా ఉంటుందని గుణశేఖర్ అంటున్నాడు. మరి ఈ చిత్రానికి బన్నీ, చిరుల ఎంట్రీ ఎంతవరకు హెల్ప్ అవుతుందో వేచిచూడాల్సివుంది..!