తన 99వ సినిమా డిక్టేటర్ కోసం బాలయ్య అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రమోషన్స్‌కు కొత్తదారిని వెతుక్కుంటున్నాడు. వినాయక చవితికి ఈ చిత్రం మోషన్ పిక్చర్‌తో కూడిన టైటిల్‌ను విడుదల చేశాడు. ఖైరతాబాద్ వినాయకుడి సమక్షంలో ఓ పాటను రిలీజ్ చేశాడు. ఇక దసరాకు టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమా విడుదలకు ముహూర్తంగా నిర్ణయించాడు. ఇక ఆడియోను క్రిస్మస్ కానుకగానో, లేక మరో పండగనో టార్గెట్ చేయనున్నాడు. చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయనున్న బాలయ్య ఇలా పండగలను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.