Advertisementt

విజయ్‌కి షాక్‌ ఇచ్చిన రజనీకాంత్‌.!

Tue 06th Oct 2015 07:27 AM
vijay new movie puli,puli 3 days collections,rajnikanth appreciated puli movie,vijay disappointed with puli,puli movie got mixed talk puli review in cinejosh,puli movie cinejosh review  విజయ్‌కి షాక్‌ ఇచ్చిన రజనీకాంత్‌.!
విజయ్‌కి షాక్‌ ఇచ్చిన రజనీకాంత్‌.!
Advertisement
Ads by CJ

భారీ బడ్జెట్‌తో, హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఒకరోజు అటు, ఇటుగా రిలీజ్‌ విజయ్‌ కొత్త సినిమా పులికి కొన్నిచోట్ల డిజాస్టర్‌ టాక్‌ వస్తే, మరికొన్ని చోట్ల డివైడ్‌ టాక్‌ వచ్చింది. విజయ్‌కి తమిళనాడులో మంచి ఫాలోయింగ్‌ వున్న విషయం తెలిసిందే. ఆ ఫాలోయింగ్‌ వల్లే మొదటి మూడు రోజుల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆ మూడు రోజుల తర్వాత పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా తనకు బాగా నచ్చిందని, ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేశారని ప్రశంసల వర్షం కురిపించాడు. అంతటితో ఆగకుండా విజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌ని తెగ పొగిడాడట. విజయ్‌ కెరీర్‌లోనే ఇది బ్యాడ్‌ మూవీ అనీ, ఇది తమ అభిమాన హీరో చెయ్యాల్సిన సినిమా కాదని ఫ్యాన్స్‌ చాలా ఆగ్రహంతో వున్నారు. అలాంటి సమయంలో రజనీకాంత్‌ ఈ సినిమా గురించి, విజయ్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి మాట్లాడేసరికి విజయ్‌ కూడా షాక్‌ అయ్యాడట. మరి ఈ సినిమాకి రజనీకాంత్‌ ఇచ్చిన అప్రిషియేషన్‌ కలెక్షన్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వెయిట్‌ అండ్‌ సీ.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ