మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న బ్రూస్‌లీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మెగస్టార్ చిరంజీవి ఓ మూడు నిముషాల స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్‌లో కూడా అకోటబర్ 16నే రిలీజ్ చేస్తున్నారు. అయితే తమిళ్ వెర్షన్‌కి ఛేంజ్ ఏమిటంటే బ్రూస్‌లీ టైటిల్‌ని బ్రూస్‌లీ2గా మార్చారు. తమిళ్‌లో జి.వి.ప్రకాష్‌కుమార్ ఆల్రెడీ బ్రూస్‌లీ అనే సినిమా ఒకటి చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రూస్‌లీ2గా టైటిల్‌ని మార్చినట్టు తెలుస్తోంది. బ్రూస్‌లీ 2 ఆడియో అక్టోబర్ 7న చెన్నయ్‌లో జరగబోతోంది. సినిమా బ్రూస్‌లీతోపాటే అక్టోబర్ 16న విడుదలవుతుంది.