బాహుబలికి పోటీగా రూపొందుతున్న చిత్రంగా అందరూ ఊహించిన పులి చిత్రం గురువారం ఆలస్యంగా విడుదలయిన సంగతి తెలిసిందే. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తమిళ, తెలుగు రెండుభాషల్లోనూ ఈ చిత్రంతో విజయ్‌కి చుక్కలు కనిపించనున్నాయని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 130కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ పులిని నిర్మాత శోభారాణి తెలుగులో 8కోట్లకు డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలకావడం, ఓ రోజు ఆలస్యంతోనే సినిమాకు నష్టాలు ప్రారంభమయ్యాయి. దానికి తోడు టాక్ కూడా భయంకరంగా ఉంది. విజయ్ నటించిన సూపర్‌హిట్టు చిత్రం తుపాకీనే తెలుగు ప్రేక్షకులు చూడలేదు. ఇక ఫ్లాప్ సినిమాకి జనం ఎక్కడి నుండి వస్తారు? అంటున్నారు. దాంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా భారీ నష్టాలు ఖాయమన్న విషయం రూఢీ అవుతోంది. మొత్తం మీద పులి ఎన్నికోట్లను మింగేయనుందో చూడాలి..! సగానికి సగం మాత్రం ఖచ్చితంగా నష్టాలు మిగులుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.