దాదాపు అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న హీరో నారా రోహిత్. ప్రస్తుతం ఆయన మహేష్ సూరపనేని అనే దర్శకుడి చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కథలో రాజకుమారి అనే టైటిల్‌ను ఈ సినిమాకు కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో షామిలిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. బేబీ షామిలీగా చిన్నప్పుడే బోలెడు పాపులారిటీ సంపాదించుకుంది షామిలి. సిద్దార్ధ్ హీరోగా వచ్చిన ఓయ్ సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే ఆ సినిమా తర్వాత మరలా కనిపించలేదు. ఇప్పుడు రోహిత్ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తోంది. ఈ రీఎంట్రీలో సరికొత్త షామిలిని చూస్తారు అని యూనిట్ సభ్యులు నమ్మకంతో చెబుతున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత..!