ఈ మాట మనం చాలా సందర్భాల్లో విని వుంటాం. హీరోగానీ, హీరోయిన్‌గానీ, డైరెక్టర్‌గానీ ఒక రెమ్యునరేషన్ తీసుకొని రెండు సినిమాలు చేసిన సందర్భాలు చాలా వున్నాయి. అలా కాకుండా ఒకే రెమ్యునరేషన్‌కి దాదాపు యూనిట్‌లోని అందర్నీ రెండో సినిమా కూడా చెయ్యాలని, లేకపోతే మీరు అవసరం లేదని చెప్పే నిర్మాత గురించి మీరెక్కడైనా విన్నారా? ఇలాంటి నిర్మాతలు కూడా వుంటారని ఇది చదివితే మీకూ తెలుస్తుంది. ఈ వారం రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఓ తెలుగు సినిమా నిర్మాత అదే హీరోతో చేస్తున్న మరో సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకటీ అరా తేడా తప్ప అంతా వాళ్ళే. ఒక సినిమా రెమ్యునరేషన్ ఇచ్చి సదరు నిర్మాత రెండు సినిమాలకు వర్క్ చేయించుకుంటున్నాడని యూనిట్ సభ్యులు వాపోతున్నారు. సీనియర్ నిర్మాత కావడంతో అతనికి ఎదురు చెప్పలేక ఇచ్చిందే చాలని రెండో సినిమాకి కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి పొదుపు చర్యలు ఎప్పటికీ అచ్చి రావనీ, దాని వల్ల సక్సెస్ ఆమడ దూరం పరిగెడుతుందని గ్రహించని ఆ నిర్మాతకు రెండో సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో కదా!