Advertisementt

చేరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్న ఆదిత్యా ఓం

Mon 05th Oct 2015 02:22 AM
hero aditya om,director aditya om,aditya om adopting a village,aditya om birthday on 5th oct,aditya om new movie friend request,friend request movie in post production  చేరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్న ఆదిత్యా ఓం
చేరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్న ఆదిత్యా ఓం
Advertisement
Ads by CJ

జయాపజయాలకు అతీతంగా నటుడిగా గుర్తించి ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి తనవంతు సేవలందించే లక్ష్యంతో ఇకపై సగం సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్టు నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం తెలిపారు. అక్టోబర్‌ 5 తన పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటితో కలిసి ఎడ్యులైట్‌మెంట్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి సెప్టెంబర్‌ 3న న్యూఢిల్లీలో, అక్టోబర్‌ 2న ముంబాయిలో ఆజాద్‌ మైదాన్‌లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులను కాంక్షిస్తూ నిరాహార దీక్షను చేపట్టామని, యువత అందిస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే తనను ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకుల కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టాలని భావించి నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి ఇచ్చిన సలహా మేరకు భద్రాచలం దగ్గరలోని చెరుపల్లి అనే మారు మూల గ్రామాన్ని దత్తత తీసుకొని స్థానికంగా చక్కని కార్యక్రమాల్ని చేపడుతున్న ఆనందం ఫౌండేషన్‌, అమ్మ నాన్న ఫౌండేషన్‌ల సహకారంతో దశలవారీగా 10 సంవత్సరాల ప్రణాళికలో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. 

ఇక మా మోడ్రన్‌ సినిమా బేనర్‌లో నిర్మిస్తున్న తాజా చిత్రం ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ విషయానికి వస్తే షూటింగ్‌ టోటల్‌గా కంప్లీట్‌ చేసి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నాం. ఈనెలాఖరులోగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ అవుతుంది. త్వరలోనే ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. నవంబర్‌లో థియేటర్ల వెసులుబాటును బట్టి సినిమా రిలీజ్‌ డేట్‌ని ఎనౌన్స్‌ చేస్తామని తెలిపారు. సినిమా నిర్మాణంతోపాటు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలలో సైతం నా వెంట వుంటున్న విజయ్‌వర్మ పాకలపాటికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. 

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ నిర్మాణ భాగస్వామి విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ఎవరో బయ్యర్స్‌ వస్తున్నారు, కొంటారు అనే ధోరణిలో కాకుండా అవసరమైతే సొంతంగా సినిమాని రిలీజ్‌ చెయ్యాలి అనే ధైర్యంతోనే ఈ సినిమా మొదలు పెట్టామని, అందుకే క్వాలిటీని, కాన్సెప్ట్‌ని నమ్ముకొని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ