వర్మకు సంతోషం వచ్చినా పట్టలేం.. కోపం వచ్చినా పట్టలేం. ఏదో ఒకవిధంగా తన ట్విట్టర్ సహాయంతో లేనిపోని వివాదాలు సృష్టిస్తుంటాడు. తాజాగా ఆయన పవన్‌కళ్యాణ్‌ను మహేష్‌బాబుతో పోలుస్తూ, పవన్‌ను తక్కువ చేసి చూపిస్తూ, ఏకంగా పవన్ అభిమానులను కూడా వర్మ టార్గెట్ చేశాడు. తాజాగా ఆయన ఇప్పుడు రామ్‌చరణ్ చేస్తోన్న బ్రూస్‌లీకి పేరడీ అన్నట్లుగా తాను కూడా అదే టైటిల్‌కు ముందు ఆర్.జి.వి. బ్రూస్‌లీ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఎప్పుడు తీశాడో గానీ హఠాత్తుగా ఆయన ఈ చిత్రం ఫస్ట్‌లుక్స్, ట్రైలర్స్‌ను విడుదల చేసి మెగాభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇండియన్ సినీ చరిత్రలో రూపొందుతున్న తొలి మార్షల్ ఆర్ట్ ఫిలిం అంటూ ప్రమోషన్ మొదలుపెట్టాడు. ఇది ఖచ్చితంగా రామ్‌చరణ్ బ్రూస్‌లీకి సెటైర్‌గా రూపొందిందని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫ్రీగా వచ్చే పబ్లిసిటీని క్యాష్ చేయడంలో ఎప్పుడూ ముందుండే వర్మ ఇప్పుడు రామ్‌ఛరణ్ బ్రూస్‌లీని తన సినిమాకు ప్రమోషన్‌గా వాడుకొని, అందరిలో ఈ చిత్రం గురించి చర్చించుకునేలా చేస్తున్నాడు. అయితే మెగాభిమానులు మాత్రం వర్మను అసలు పట్టించుకోవడం మానేశారు. ఆయన పవన్ గురించి కామెంట్స్ చేసిన విషయాన్ని వారు లైట్‌గా తీసుకుంటున్నారు. మహేష్‌బాబు అయితే తరచుగా తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి రెగ్యులర్ అప్‌డేట్స్ చేస్తుంటాడని, పవన్ మాత్రం తనకు నచ్చిన విషయం ఏమైనా ఉంటే ఎప్పుడో గానీ ట్విట్టర్‌ను వాడుకోడని, అదే పవన్ కూడా తన సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాల గురించి రెగ్యులర్‌గా ట్వీట్స్ చేస్తుంటే పవన్ ఫాలోయర్స్ 20లక్షల పైగానే ఉంటారనే విషయాన్ని వర్మ మర్చిపోయాడంటూ మెగాభిమానులు వర్మపై సెటైర్లు వేస్తున్నారు.