రుద్రమదేవి రిలీజ్‌ని వాయిదా వేసుకుంటూ వచ్చిన గుణశేఖర్ ఎట్టకేలకు అక్టోబర్ 9న సినిమాని వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అంతవరకు బాగానే వుంది గానీ ఒక భారీ సినిమా, హిస్టారికల్ మూవీ, పైగా తొలి ఇండియన్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ రిలీజ్ అవుతోందంటే ఎంత హడావిడి వుంటుంది. అవేవీ ఈ సినిమాకి కనిపించడం లేదు. రిలీజ్‌కి పట్టుమని వారం రోజులు కూడా లేదు. గుణశేఖర్ మాత్రం పబ్లిసిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కేవలం వీడియో ఇంటర్వ్యూలపైనే ఆధారపడ్డాడు తప్ప మిగతా మాధ్యమాలను ఉపయోగించుకోవడం లేదు. బాహుబలి పబ్లిసిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా సినిమా రిలీజ్ వరకు కొనసాగించారు. ఆ పద్ధతినే రుద్రమదేవి విషయంలో కూడా ఫాలో అయి వుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా రుద్రమదేవి డిస్కషనే వుండేది. అక్టోబర్ 9 రిలీజ్ డౌటే అని మీడియాలో న్యూస్ వచ్చిన వెంటనే డైలీ పేపర్స్‌లో రిలీజ్ డేట్‌తో యాడ్స్ ఇచ్చేస్తున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేసిన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చేసుకునే విషయంలో గుణశేఖర్ ఎందుకు స్లో అయిపోయాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాని రిలీజ్ చెయ్యడానికి మాత్రం గుణశేఖర్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో 160కి పైగా థియేటర్లలో 3డి, 2డి ఫార్మాట్‌లలో స్క్రీనింగ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా రుద్రమదేవి పబ్లిసిటీ విషయంలో మరి కాస్త శ్రద్ధ పెట్టి వుంటే సినిమాకి మరింత హైప్ వచ్చేది.