మన స్టార్ హీరోలు ప్రస్తుతం అందరూ షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. అయితే వారు నటించే తదుపరి చిత్రాలపై మాత్రం సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మొత్సవం చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన కోసం శేఖర్‌కమ్ముల, వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులు వెయిటింగ్ చేస్తున్నారు. ఇక పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్‌గబ్బర్‌సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత లిస్ట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, డాలీ వంటి దర్శకులతో పాటు దాసరి నిర్మాతగా మరో చిత్రం ఉండనుంది. వీటిల్లో ఆయన తన తదుపరి ఏచిత్రం చేస్తాడు? అనేది సస్పెన్స్‌గా ఉంది. రామ్‌చరణ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్‌లీ చిత్రం చేస్తున్నాడు. తన తదుపరి చిత్రంగా ఆయన తమిళ రీమేక్ తని ఒరువన్ చేస్తాడా? లేక మరో ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తాడా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం తర్వాత ఆయనతో సినిమా చేయడానికి కొరటాల శివతో పాటు గోపీచంద్ మలినేని ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇక బన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తదుపరి ఆయన ఎవరితో సినిమా చేస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.