రజనీకాంత్ హీరోగా కబలేశ్వరన్ అనే డాన్ జీవిత కథతో రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమిళంలో కబాలి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభం సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ స్టిల్స్ అందరినీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప్రియులను బాగా అలరించాయి. కాగా ఈ చిత్రానికి తెలుగులో ఏ టైటిల్ పెట్టాలా? అనే సందిగ్దంలో చిత్ర దర్శకనిర్మాతలు ఉన్నారు. కాగా గతంలో వచ్చిన బాషా, ముత్తు, లింగ తరహాలోనే హీరో క్యారెక్టర్ పేరైనా కబాలి అనే హీరో క్యారెక్టర్ టైటిల్‌నే తెలుగులో ఫిక్స్ చేస్తే సరిపోతుందని తమిళ వర్గాలు అంటున్నాయి. మరి తెలుగులో కూడా ఈ చిత్రానికి కబాలి అనే టైటిల్‌ను పెడతారా? లేక అంతకంటే మంచి టైటిల్‌ను ఎంచుకోవడానికి కష్టపడతారో వేచిచూడాల్సివుంది..!