సాధారణంగా టాలీవుడ్‌లో పరిచయం చేసే హీరోయిన్లకు మొదటి సినిమాకు కేవలం ఐదు లేదా పదిలక్షల పారితోషికం మాత్రమే ఇస్తారు. కానీ మెగా కుటుంబం నుండి వస్తున్న మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికకు మాత్రం మొదటి సినిమాకే 40లక్షల పారితోషికం ఆఫర్ చేశారట. మధురశ్రీధర్, టివి9 సంయుక్త బాగస్వామ్యంలో రూపొందే చిత్రంలో నిహారికను నాగశౌర్యకు జోడీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు చిత్రానికి దర్శకత్వం వహించిన రామరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కొణిదల నిహారికకు 40లక్షల ఆఫర్ రావడాన్ని ఫిల్మ్‌సర్కిల్స్‌లో ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు.