Advertisementt

అఖిల్‌కు చేదోడు వాదోడు..!

Fri 02nd Oct 2015 05:52 AM
akhil movie,akhil,nagachaitanya,nagarjuna,jhony master  అఖిల్‌కు చేదోడు వాదోడు..!
అఖిల్‌కు చేదోడు వాదోడు..!
Advertisement
Ads by CJ

అక్కినేని వంశం నుండి తెరంగేట్రం చేస్తున్న నవతరం హీరో అఖిల్‌. ఆయన వినాయక్‌ దర్శకత్వంలో తన డెబ్యూ మూవీ అఖిల్‌ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్‌ పూర్తికావచ్చిన ఈ చిత్రంలోని అఖిల్‌ ఇంటడ్రక్షన్‌ సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాట రూపొందనుంది. కాగా ఈ పాటలో అఖిల్‌తో పాటు అతని తండ్రి నాగార్జున, సోదరుడు నాగచైతన్య కూడా అఖిల్‌తో కలిసి చిందులేస్తున్నారు. ఈ ఇద్దరు ఈ చిత్రంలో గెస్ట్‌రోల్స్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట వల్ల సినిమాకు మరింత క్రేజ్‌ రావడంతో పాటు సినిమాకు నిండుతనం వస్తుందని, అక్కినేని అభిమానులను ఈ చిత్రం బాగా అలరిస్తుందని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ