Advertisementt

150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిందా? నాకు తెలీదే!

Fri 02nd Oct 2015 04:55 AM
megastar chiranjeevi,chiranjeevi 150th movie,director vinayak,chiranjeevi 150th movie director,chiranjeevi and vinayak combination movie  150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిందా? నాకు తెలీదే!
150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిందా? నాకు తెలీదే!
Advertisement
Ads by CJ

ఈ మాటలు ఎవరివి? 150వ సినిమా చెయ్యబోతున్న చిరంజీవివా? లేక తనే ఆ సినిమాకి డైరెక్టర్‌ అని ప్రచారం జరుగుతున్న వినాయక్‌వా? అనే డౌట్‌ మీకు రావచ్చు. ఈ మాటలు అన్నది మాత్రం ముమ్మాటికీ వినాయకే. నిన్న ఓ న్యూస్‌ ఛానల్‌లో ఆర్భాటంగా చిరంజీవి 150వ సినిమా కన్‌ఫర్మ్‌ అయిందనీ, కత్తి రీమేక్‌గా తెలుగులో చిరు సినిమా రూపొందుతుందని, వినాయక్‌ ఈ సినిమాని డైరెక్ట్‌ చేస్తాడని అఫీషియల్‌ న్యూస్‌ చెప్పినంత స్ట్రాంగ్‌గా చెప్పేశారు. నిజానికి చిరంజీవి సినిమాకి తాను డైరెక్టర్‌ అని వినాయక్‌కి కూడా తెలీదట. ఈమధ్యకాలంలో తనని ఆ సినిమా గురించి ఎవరూ సంప్రదించలేదని, ఈ న్యూస్‌ ఎలా వచ్చిందో తనకి తెలియదని వినాయక్‌ అంటున్నాడు. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు, అభిమానులు ఎంతమంది వున్నారో తెలీదుగానీ ఆ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు చేస్తూ, కాంబినేషన్స్‌ సెట్‌ చేసేసి ప్రేక్షకుల ముందుంచే వ్యక్తులు మాత్రం చాలా మంది వున్నారు. ఒక న్యూస్‌ ఛానల్‌లో వచ్చిన ఈ న్యూస్‌ మీడియా అంతా స్ప్రెడ్‌ అయిపోవడంతో షాక్‌ అవడం వినాయక్‌ వంతు అయింది. దీనికి చిరంజీవి, రామ్‌చరణ్‌ స్పందన ఏమిటో తెలీదుగానీ మొత్తానికి చిరు 150వ సినిమా వార్త మాత్రం మీడియా అంతా హల్‌చల్‌ చేస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ