Advertisementt

శృతి తర్వాత కృతి..!

Fri 02nd Oct 2015 03:26 AM
kriti kharbanda,sruthihasssan,ramayya vasthavayya,brucelee  శృతి తర్వాత కృతి..!
శృతి తర్వాత కృతి..!
Advertisement
Ads by CJ

సహజంగా ఎవ్వరూ ఊహించిన ఓ అరుదైన ఫీట్‌ను ఇటీవల శృతిహాసన్‌ నిజం చేస్తే ఇప్పుడు అదే ఫీట్‌ను కృతికర్బంద మరోసారి ఈ ఫీట్‌ సాధించిన హీరోయిన్‌గా ఘనత సాధించనుంది. వాస్తవానికి ఇదో విచిత్రమైన రికార్డు. ఆమధ్య శృతిహాసన్‌ తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన రామయ్యావస్తావయ్యా చిత్రంలో నటించింది. కాగా అదే సమయంలో ఆమె ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్‌ మూవీ అదే టైటిల్‌ రామయ్యావస్తావయ్యాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించింది. ఒకే టైటిల్‌తో రూపొందిన రెండు వేర్వేరు భాషల చిత్రాలలో శృతి ఒకేసారి నటించిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు కృతికర్బంద కూడా అదే ఫీట్‌ సాధిస్తోంది. ఆమె తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న బ్రూస్‌లీ చిత్రంలో సోదరి పాత్రను పోషిస్తోంది. ఇదే సమయంలో ఆమె తమిళంలో జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా రూపొందుతున్న బ్రూస్‌లీ అనే టైటిల్‌ పెట్టిన చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాకతాళీయంగా జరిగినప్పటికీ ఇది అరుదైన ఫీట్‌ అనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ