ఇప్పటికే భలేభలే మగాడివోయ్ తోపాటు సాయిధరమ్‌తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలు మంచి హిట్ టాక్‌తో కోట్లు కొల్లగొడుతున్నాయి. చిన్న సినిమాలుగా విడుదలైన ఈ చిత్రాలు పెద్ద పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఇక అక్టోబర్ మాసంలో అయితే ఈ నెల ప్రారంభంలోనే తమిళంలో దాదాపు 125కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విజయ్ పులి చిత్రం విడుదల అవుతోంది. ఆ పక్క రోజునే అంటే గాంధీ జయంతి రోజున రామ్ హీరోగా నటిస్తున్న శివమ్ చిత్రం భారీ ఎత్తున రిలీజ్‌కు సిద్దం అవుతోంది. అక్టోబర్ 9న దాదాపు 70కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి విడుదలకానుంది. అక్టోబర్ 16న రామ్‌చరణ్ నటిస్తున్న బ్రూస్‌లీ ని చిత్రం ఎలాగైనా వందకోట్లు సాధించాలనే ఆశయంతో విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఆ వచ్చే వారం అంటే అక్టోబర్ 22న అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న అఖిల్ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్దం అవుతోంది. ఇక అక్టోబర్ 30న కళ్యాణ్‌రామ్ నటిస్తున్న షేర్ చిత్రంతో పాటు సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ విడుదలకు రెడీ అవుతోంది. మొత్తానికి అక్టోబర్ మాసం చిన్న చిత్రాలతో పాటు పెద్ద సినిమాలతో కళకళలాడనుంది.