Advertisementt

ఎట్టకేలకు చిరు 150 వ చిత్రం కన్ఫర్మ్!

Thu 01st Oct 2015 08:05 AM
chiranjeevi 150th movie,vinayak,ram charan,murugadoss  ఎట్టకేలకు చిరు 150 వ చిత్రం కన్ఫర్మ్!
ఎట్టకేలకు చిరు 150 వ చిత్రం కన్ఫర్మ్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి 150 వ సినిమాకు పూరీని దర్శకునిగా తొలగించి వినాయక్‌తో మంతనాలు జరుపుతున్నాడనే మాటలు వినిపించాయి. తాజాగా ఈ విషయాలను నిజం చేస్తూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. కత్తి రీమేక్ చిత్రాన్ని ఇప్పటివరకు ఎన్టీఆర్ చేస్తాడని వార్తలొచ్చాయి. కాని చిరంజీవి 150వ చిత్రంగా కత్తి రీమేక్ నే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ చిత్ర కథ చిరు కి బాగా నచ్చడంతో ఓకే చెప్పాడట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కత్తి చిత్రం ఉంటుందని తెలుస్తోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవి ఠాగూర్ చిత్రానికి కథ అందించిన మురుగదాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే భాధ్యతలు నిర్వహించనున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకను భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం బ్రూస్ లీ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నా తన 150వ చిత్రంగా మాత్రం కత్తి మూవీనే భావిస్తారట. అక్టోబర్2 న జరగనున్న బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లో చిరు కత్తి సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నారని సమాచారం..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ