ఈ ఏడాది ప్రారంభంలోనే పటాస్ చిత్రంతో తన కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచిన హీరో, నిర్మాత కళ్యాణ్‌రామ్ త్వరలో షేర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తనకు ఇది వరకు ఫ్లాప్‌నిచ్చిన మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న షేర్ చిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. కాగా ఈ ఆడియో వేడుకు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హాజరై తొలి సీడీని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పటాస్ చిత్రంతో ఘనవిజయం సాదించిన నందమూరి కళ్యాణ్‌రామ్ ఆ విజయం ఏదో అదృష్టం వల్ల ఆడిందనే అపవాదును పోగొట్టుకోవాలంటే షేర్ తో తన పవర్ మరోసారి చూపించాల్సిన అవసరం ఉంది.