క్రిష్ దర్శకత్వంలో మెగాహీరో వరుణ్‌తేజ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంచె అక్టోబర్ 2న విడుదల కావాల్సింది. కానీ ఈ చిత్రాన్ని ఏకంగా నెల రోజుల గ్యాప్ తీసుకొని దీపావళి కానుకగా నవంబర్ 6న కానీ, లేదా నవంబర్ 11న కానీ రిలీజ్ చేయనున్నారు. కాగా కిక్2 తో డిజాస్టర్ ఫలితం అందుకున్న రవితేజ నటిస్తున్న తాజా చిత్రం బెంగాల్ టైగర్ చిత్రం నవంబర్ 5న విడుదలకు సిద్దమవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు క్లాష్ కానున్నాయి. కాగా బెంగాల్ టైగర్ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తుండగా, కె.కె.రాధామోహన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.ఈ చిత్రం ఆడియోవేడుక అక్టోబర్ 17న విడుదలకానుంది. మరి బాక్సాఫీస్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు? అనేది వేచిచూడాల్సివుంది....!