హీరో రామ్‌తో ఇటీవల పండగచేస్కో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని తన తదుపరి చిత్రం కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నాడు. మురుగదాస్ అందిస్తున్న కథను ఎన్టీఆర్‌కు నేరేట్ చేయనున్నాడు. కాగా ఈచిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి మురుగదాస్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం ఎన్టీఆర్ కోసం తయారు చేసిన సబ్జెక్ట్‌గా చెబుతున్నారు. ఎన్టీఆర్ ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్ మెటీరిజయలైజ్ అవుతుంది. కాగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థలో చేయనున్న సంగతి తెలిసిందే.కాగా ఎన్టీఆర్‌కు గోపీచంద్ మలినేని వినిపించే స్టోరీ తమిళంలో సూపర్‌హిట్ అయిన కత్తి కి రీమేక్‌గా రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి పలు మార్పులు చేర్పులు చేసి ఈ కథను సరికొత్తగా గోపీచంద్ మలినేని మలిచాడని సమాచారం.