మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికను త్వరలో మధుర శ్రీధర్, టివి9ల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్న చిత్రంలో నాగశౌర్యకు జోడీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయిన రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. స్వచ్చమైన ప్రేమకథాచిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఒక మనసు అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. కాగా కొణిదెల నిహారికకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మిణుగురులు చిత్రం ద్వారా అవార్డ్‌లను అందుకున్న అయోధ్యకుమార్ దర్శకత్వంలో రూపొందే మరో చిత్రంలో కూడా నిహారిక హీరోయిన్‌గా నటిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అయోధ్యకుమార్ మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథ చెప్పడంతో నాగబాబు దానిని ఓకే చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. మరి తన రెండో సినిమాతోనే కోలీవుడ్‌కు వెళ్తున్న నిహారికకు భవిష్యత్తులో మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.