Advertisementt

ఎన్టీఆర్‌-కొరటాల మూవీకి ముహూర్తం..!

Tue 29th Sep 2015 07:30 AM
koratala siva,ntr,mirchi,sreemanthudu,nannaku prematho  ఎన్టీఆర్‌-కొరటాల మూవీకి ముహూర్తం..!
ఎన్టీఆర్‌-కొరటాల మూవీకి ముహూర్తం..!
Advertisement
Ads by CJ

శ్రీమంతుడు ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్‌తో దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్‌ 22న ప్రారంభం కానుంది. ప్రస్తుతం సుకుమార్‌తో ఎన్టీఆర్‌ చేస్తోన్న నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్‌ పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. నిజానికి రామయ్యా వస్తావయ్యా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ ప్రారంభం కావాల్సివుంది. అయితే ఈ లోపు పూరీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ టెంపర్‌ సినిమా చేయడం... మరోవైపు అదే సమయంలో మహేష్‌తో కొరటాల శ్రీమంతుడు చిత్రానికి కమిట్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. కాగా ఈ తాజా చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్‌22న ముహూర్తం చూసుకొంది. మరి ఇప్పటికే మిర్చితో ప్రభాస్‌కు,శ్రీమంతుడుతో మహేష్‌కు తిరుగులేని హిట్స్‌ ఇచ్చిన కొరటాల ఎన్టీఆర్‌కు ఏ స్థాయి హిట్‌ ఇస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ