ఏ హీరోయిన్ అయినా మంచి ఫామ్‌లో ఉండగానే స్టార్‌హీరోల చిత్రాలు చేస్తూ రెమ్యూనరేషన్ పరంగా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకొని ఇల్లు చక్కదిద్దుకోవాలని భావిస్తుంది. కానీ శృతిహాసన్ రూట్ మాత్రం సపరేట్. ఇటీవలే ఆమెకు మహేష్‌బాబు సరసన నటించిన శ్రీమంతుడు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతకొంతకాలంగా ఆమె నటించిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధిస్తూనే ఉన్నాయి. దీంతో ఆమెకు స్టార్‌హీరోల సరసన పలు ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆమె వాటిని సద్వినియోగం చేసుకోకుండా తన సత్తాకు తగని హీరోల సరసన మాత్రం నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తాజాగా ఆమె నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించింది. నాగచైతన్య హీరోగా నటించనున్న మలయాళ చిత్రం ప్రేమమ్ కు రీమేక్‌గా ప్రారంభం కానున్న మజ్ను చిత్రంలో నటించేందుకు ఆమె ఓకే చెప్పింది. ఇక ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఓ హీరోయిన్‌గా శృతిహాసన్, మరో హీరోయిన్‌గా మలయాళంలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌లు నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. తెలుగులోనే కాదు శృతిహాసన్ తమిళ, హిందీ చిత్రాల్లో కూడా ఇలా ఎవ్వరూ ఊహించని రీతిలో స్టార్స్‌ను కాదని, యంగ్‌హీరోల సినిమాలకు పచ్చజెండా ఊపడం చూస్తుంటే శృతిహాసన్ రూటే సపరేట్ అని ఒప్పుకోవాల్సిందే.