Advertisementt

అందుకే సురేందర్‌రెడ్డిని లక్కీ ఫెల్లో అంటున్నారు!

Mon 28th Sep 2015 12:18 PM
surendar reddy,kick2,ram charan,brucelee,thani oruvan  అందుకే సురేందర్‌రెడ్డిని లక్కీ ఫెల్లో అంటున్నారు!
అందుకే సురేందర్‌రెడ్డిని లక్కీ ఫెల్లో అంటున్నారు!
Advertisement
Ads by CJ

కిక్‌2 ఘోరపరాజయం పాలవ్వడంతో విమర్శకులు ఈ సినిమా డిజాస్టర్‌ ఫలితానికి దర్శకుడు సురేందర్‌రెడ్డినే ముఖ్యకారకుడిగా పేర్కొంటూ ఆయన్ను విమర్శిస్తున్నారు. మితిమీరిన విశ్వాసంతో తన ఇష్టం వచ్చినట్టుగా నిర్మాత చేత ఖర్చుపెట్టించిన దర్శకునిగా ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే కిక్‌2 విడుదలకు ముందే... అంటే దాదాపు రేసుగుర్రం సూపర్‌హిట్టు అయిన నేపథ్యంలోనే ఆయనతో ఓ సినిమా చేస్తానని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట ఇచ్చాడు. దాంతో రామ్‌చరణ్‌ తన బ్రూస్‌లీ తర్వాత సురేందరెడ్దితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా నిర్మాత డివివి దానయ్య, ఎన్వీప్రసాద్‌ల సంయుక్త భాగస్వామ్యంలో తమిళంలో ఘనవిజయాన్ని సాధిస్తున్న తని ఒరువన్‌ రీమేక్‌ కావడం గమనార్హం. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో డైరెక్ట్‌ చేసిన జయం రాజానే తెలుగులోనూ డైరెక్ట్‌ చేస్తాడనే షరత్తు ఉన్నప్పటికీ ఆర్థిక ప్యాకేజీతో ఆయన్ను పక్కన పెట్టి ఆ బాధ్యతలను సురేందర్‌రెడ్డికి అప్పగించారని తాజా సమాచారం. కిక్‌2 వంటి ఘోరపరాజయం తర్వాత కూడా ఓ సూపర్‌హిట్టు రీమేక్‌ను అందునా రామ్‌చరణ్‌తో చేసే ఛాన్స్‌ను కొట్టేసిన సురేందర్‌రెడ్డిని లక్కీ ఫెల్లో అని అనకుండా ఉండలేం..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ