మన హీరోలకు పెద్దగా నచ్చని పదం ప్రమోషన్. అందుకే సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా మన హీరోలు ప్రమోషన్ అంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఓ సినిమాకు ప్రమోషన్ అనేది ఎంత అవసరమో బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు నిరూపించాయి. ఈ విషయాన్ని తన తొలి చిత్రంతోనే అర్థం చేసుకున్న అక్కినేని అఖిల్ తన తొలిచిత్రం అఖిల్ కు ప్రమోషన్‌కు పెద్దపీట వేస్తున్నాడు. ఏకంగా టాలీవుడ్‌కు మరో నైజాంగా మారిన ఓవర్‌సీస్ మార్కెట్‌పై అఖిల్ కన్నేశాడు. ఇప్పటివరకు ఏ చిత్రానికి.. ఏ హీరో చేయని ప్రమోషన్‌కు అఖిల్ శ్రీకారం చుట్టాడు. ఏకంగా తన టీంతో కలిసి మూడు రోజులు అమెరికాలో ప్రమోషన్ చేస్తున్నాడు. అది పూర్తి కాగానే మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కాస్తో కూస్తో పేరున్న ప్రతి పట్టణం, నగరంలో ప్రమోషన్ చేయడంపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఆయన ఓ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. ఇలా సినిమా విడుదలకు మరో నెల రోజుల ముందుగానే ప్రమోషన్‌ను ప్రారంభించిన అఖిల్ కష్టం ఊరికే పోదని, కష్టపడి ప్రమోషన్ చేయడానికి డిసైడ్ అయిన అఖిల్‌కు అందుకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.