Advertisementt

దర్శకుల మాయలో మహేష్‌..!

Sat 26th Sep 2015 08:38 AM
mahesh babu,poori jagannath,trivikram sreenivas,koratala siva  దర్శకుల మాయలో మహేష్‌..!
దర్శకుల మాయలో మహేష్‌..!
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరోలు హీరోయిన్ల మాయలో పడిపోతారు. కానీ టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు దర్శకుల మాయలో పడిపోతుంటాడు. తనకు హిట్‌ ఇచ్చిన దర్శకులకు మరీ మరీ పిలిచి చాన్స్‌లు ఇవ్వడం మహేష్‌కు అలవాటు. తనకు ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్‌ అందించిన గుణశేఖర్‌కు ఆ తర్వాత అర్జున్‌, సైనికుడు వంటి అవకాశాలను ఇచ్చాడు. ఇక పూరీ జగన్నాథ్‌ తనకు పోకిరి వంటి హిట్‌ ఇచ్చిన తర్వాత మరలా పూరీకి బిజినెస్‌మేన్ తో పాటు త్వరలో మరో సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాడు. అతడు వంటి సూపర్‌హిట్‌ను ఇచ్చిన త్రివిక్రమ్‌కు ఆ తర్వాత ఖలేజా తో అవకాశం ఇవ్వడంతో పాటు త్వరలో త్రివిక్రమ్‌కి మరో సినిమా చేసే ఉద్దేశ్యంలో మహేష్‌ ఉన్నాడు. అలాగే తనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల ఇటీవల తీసిన ముకుందా చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ పిలిచి మరీ బ్రహ్మొత్సవం చాన్స్‌ ఇచ్చాడు. తాజాగా ఆయనకు శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్‌ అందించిన కొరటాల శివకు 60లక్షల విలువ చేసే ఆడి6 కారును బహుమతిగా ఇవ్వడంతో పాటు ఆయనతో మరో సినిమా సినిమా చేస్తానని కొరటాలకు మాట ఇచ్చాడట. మరి ఇప్పటికే ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉన్న కొరటాలకు మహేష్‌ సెకండ్‌ చాన్స్‌ ఎప్పుడు ఇస్తాడు? అనేది ఖచ్చితంగా చెప్పకపోయినా త్వరలోనే కొరటాలకు మరో సినిమాకు అవకాశం ఇవ్వడం మాత్రం ఖాయమైపోయినట్లే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ