Advertisementt

25కోట్లపై కన్నేసిన యంగ్‌ హీరోలు..!

Sat 26th Sep 2015 07:16 AM
bhale bhale magadivoy,nani,akhil,sai dharam tej  25కోట్లపై కన్నేసిన యంగ్‌ హీరోలు..!
25కోట్లపై కన్నేసిన యంగ్‌ హీరోలు..!
Advertisement
Ads by CJ

బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల ఘనవిజయంతో తెలుగు సినిమా మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. దీంతో పెద్దపెద్ద స్టార్‌హీరోల టార్గెట్‌ ఇప్పుడు 50 కోట్ల నుండి 100కోట్లకు పెరిగింది. ప్రతి స్టార్‌హీరో కన్ను ఇప్పుడు 100కోట్లపై ఉంది. అయితే కొందరు యంగ్‌హీరోలు మాత్రం ఇప్పుడు తమ టార్గెట్‌ను 25కోట్లపై కన్నేశారు. సాయిధరమ్‌తేజ్‌ సుబ్రమణ్యం ఫర్‌సేల్‌ చిత్రంతో కానీ, లేక సుప్రీమ్‌ చిత్రంతో గానీ 25కోట్ల మార్క్‌ దాటాలని భావిస్తున్నాడు. ఇక నాని విషయానికి వస్తే ఆయన మార్కెట్‌ నిన్న మొన్నటివరకు 12 కోట్లు మాత్రమే ఉండేది. ఈగ చిత్రం 40కోట్లు దాటినా కూడా ఆక్రెడిట్‌ మొత్తం రాజమౌళికే దక్కింది. కానీ తాజాగా నాని నటించిన భలే భలే మగాడివోయ్‌ చిత్రం అనూహ్య విజయం సాధించి 25కోట్ల క్లబ్బులో స్ధానం సంపాదించుకొంది. దీంతో నాని తదుపరి చిత్రాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాదు... ఇప్పుడు యంగ్‌హీరోలందరికీ నాని స్ఫూర్తిగా మారాడు. ఇక 21కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కంచె చిత్రంతో వరుణ్‌తేజ్‌ 25కోట్ల క్లబ్బులో చేరుతాడని అందరూ భావిస్తున్నారు. కంచె అటు ఇటు అయినా కూడా ఆ తర్వాత పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లోఫర్‌ చిత్రంతో అయినా వరుణ్‌తేజ్‌ 25కోట్లపై కన్నేశాడు. ఇక అక్కినేని నాగచైతన్య విషయానికి వస్తే ఆయన ఇప్పటివరకు సోలో హీరోగా 25కోట్ల మార్కెట్‌ దాటలేదు. మనం చిత్రం దాదాపు 40కోట్ల వరకు వసూలు చేసినప్పటికీ అందులో చైతూ సోలోహీరో కాదు. దాంతో తన తదుపరి చిత్రాలైన సాహసం శ్వాసగా సాగిపో, లేదా ప్రేమమ్‌ రీమేక్‌.. ఈ రెండింటిలో ఒకటైనా తనను 25కోట్ల మార్కెట్‌లోకి తీసుకెలుతుందనే ఆశతో ఉన్నాడు. ఆయన తమ్ముడు అక్కినేని అఖిల్‌ తన తొలి చిత్రంతోనే 50కోట్లు దాటడం ఖాయమైంది. ఇక 100కోట్లపై ఇప్పటికే అఖిల్‌ కన్నేశాడు.. ఇలాంటి పరిస్థితుల్లో తాను 25కోట్ల క్లబ్బులో చేరడం తప్పనిసరి అని చైతూ డిసైడ్‌ అయ్యాడు.ఇక ఇదే క్లబ్బులో చేరాలని యంగ్‌హీరో రామ్‌ కూడా కలలు కంటున్నాడు. ఆయన నటించిన రెడీ, కందిరీగ చిత్రాలు 20కోట్లు వసూలూ చేశాయి. దీంతో శివమ్‌ చిత్రం ద్వారానైనా 25కోట్లు కొల్లగొట్టాలని రామ్‌ పట్టుదలతో ఉన్నాడు. మొత్తానికి ఈ యంగ్‌హీరోలందరికీ ఇప్పుడు నాని ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ