Advertisementt

త్రివిక్రమ్‌ రూటు మార్చాడు..!

Sat 26th Sep 2015 05:09 AM
trivikram sreenivas,nithin,a aa movie,poorijagannath  త్రివిక్రమ్‌ రూటు మార్చాడు..!
త్రివిక్రమ్‌ రూటు మార్చాడు..!
Advertisement
Ads by CJ

రచయిత నుండి దర్శకునిగా మారిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన కెరరీ ప్రారంభంలో మూడేళ్లకు ఓ సినిమా తీసేవాడు. ఆతర్వాత ఆయన ఏడాదికి ఒక సినిమా, ఆ తర్వాత ఎనిమిది నెలలకు ఒక సినిమా చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన మూడు నెలలకు ఓ సినిమా తీయాలని ఫిక్స్‌ అయ్యాడు. నితిన్‌ హీరోగా ఆయన తీస్తున్న అ..ఆ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆయన ప్లాన్‌. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 5 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఎలాగైనా ఈ చిత్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దిగాలని త్రివిక్రమ్‌ పట్టుదలగా ఉన్నాడు. ఇంతకాలం ఎలాంటి హీరో అయినా మూడు నెలల్లో సినిమాను తీసి విడుదల చేసిన ఘనత పూరీజగన్నాద్‌కే ఉంది. కానీ ఇప్పుడు పూరీ బాటలోకి త్రివిక్రమ్‌ కూడా వచ్చి చేరాడు. పూరీ జోరును ఈయన కూడా ఫాలో అవుతున్నాడు. ఓవిధంగా ఆయన ఫూరీకి ఈ విషయంలో సవాల్‌ విసురుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ