Advertisementt

పులి కోసం పరువాల పోటీ!

Sat 26th Sep 2015 02:43 AM
vijay,chimbudeva,sruthihassan,hansika,october 1st release  పులి కోసం పరువాల పోటీ!
పులి కోసం పరువాల పోటీ!
Advertisement
Ads by CJ

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో నటిస్తున్న తమిళ చిత్రం పులి. ఈ సినిమాను నిర్మాత శోభారాణి తెలుగులో అనువదిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీతో తన కెరీర్ మొదలుపెట్టినా తెలుగు కంటే తమిళంలో క్రేజ్ సంపాదించుకున్న నటి హన్సిక, సౌత్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న శ్రుతిహాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ లో శ్రుతి, హన్సికలు చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ మరి తమ అందాలతో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు అశేష ప్రేక్షకాదరణ పొందుతారో చూడాలి. ఇటీవలే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేసారు. అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ