సాధారణంగా సినిమాలలో హీరోయిన్లుగా చేయాలని భావించే అమ్మాయిలు అంతకు ముందు నుండే సంప్రదాయన నృత్యాలలో శిక్షణ తీసుకొని అవకాశాల కోసం ఎదురు చూసే పద్దతి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు కేవలం గ్లామర్‌కే గానీ మిగతా దేనికీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో హీరోయిన్‌గా వచ్చే వారికి డ్యాన్స్‌లలో పెద్ద పట్టు కనిపించడం లేదు. పోనీ హీరోయిన్ అయిన తర్వాత అయినా డ్యాన్స్ నేర్చుకుందామంటే ఒక్కసారి బిజీ అయిన తర్వాత ఇక అందుకు సమయం ఉండదు. కానీ ఓ పాత్ర కోసం ఓ నెల రోజులు కేవలం నృత్యంలో శిక్షణకే సమయాన్ని కేటాయించడం.. అందులోనూ తాను ఎంతో బిజీగా ఉన్న సమయంలో నెల రోజులను డ్యాన్స్ ప్రాక్టీస్‌కు కేటాయించడం సామాన్యమైన విషయం కాదు. కానీ దాన్ని నిజం చేస్తోంది నయనతార. ఇప్పుడు ఆమెకు దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఉంది. క్షణం తీరిక లేకుండా వరుస చిత్రాలు చేస్తోంది. అయితే ఈ అమ్మడుకు ఇటీవల మరో మలయాళ మూవీ ఆఫర్ వచ్చిందట. ఇంతకు ముందు ఆమె మమ్ముట్టి సరసన నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం పెద్ద హిట్ అయింది. మరోసారి ఆమెకు మమ్ముట్టి సరసన నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఆమె సంప్రదాయ నృత్యమైన కథాకళి డాన్సర్ పాత్రను పోషిస్తోంది. దాంతో దీని కోసం ఆమె ఓ నెల రోజులు కథకళి నేర్చుకోవడం కోసం ఓ గురువు వద్ద శిక్షణ తీసుకుంటోంది. మొత్తానికి ఆమెకు ఇటీవల వరుసగా రెండు తమిళ చిత్రాలు పెద్ద హిట్టయి ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. తని ఒరువన్‌తో పాటు మాయ చిత్రం కూడా తమిళంలో ఆమెకి మరింత పేరు ప్రతిష్టలను తీసుకొచ్చాయి. మరి ఈ మలయాళ చిత్రంలో నయన కథాకళి డాన్సర్‌గా ఎలా మెప్పించనుందో చూడాలి...!