చైతూ సినిమాకు సూపర్‌హిట్‌ టైటిల్‌..!

వారసత్వ హీరోలు తమ తండ్రులు నటించిన సూపర్‌హిట్‌ సినిమాలలోని పాటలను, టైటిల్స్‌ను తెగ వాడేసుకోవడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎందరో హీరోల తనయులు దీన్ని ఫాలో అయి హిట్లు అందుకున్నారు. కాగా ఆ లిస్ట్‌లోకి అక్కినేని వంశ హీరో నాగచైతన్య కూడా చేరాదు. త్వరలో రాధాకృష్ణ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ప్రేమమ్‌ రీమేక్‌లో నాగచైతన్య నటించనున్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రానికి ప్రేమమ్‌ అనే టైటిల్‌నే పెట్టాలని భావించారు. కానీ ఈటైటిల్‌ చైతూను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తండ్రి అక్కినేని నాగార్జునకు రొమాంటిక్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టాలని చైతూ నిర్ణయించాడు. అది దాసరి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున-రజనీ జంటగా వచ్చిన మజ్ను. ఈ మజ్ను టైటిల్‌ను ప్రేమమ్‌ రీమేక్‌కు తెలుగు టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభంకానుంది. 

nagachaitanya
premam movie remake
nagarjuna
majnu movie