రాజమౌళి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసే సెంథిల్‌కు జక్కన్న టీమ్‌లో అధిక ప్రాదాన్యం ఉంటుంది. కాగా రాజమౌళి సృష్టిస్తున్న ప్రభంజనాలకు ఒక విధంగా కుడిచేయి వంటివాడు సెంథిల్. వీరిద్దరు కలిసి చేసిన అద్బుతాలు చూస్తూనే ఉన్నాం. కాగా బాహుబలి చిత్రాన్ని చూసిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు సెంథిల్ వర్క్ విపరీతంగా నచ్చిందట. దాంతో ప్రస్తుతం తాను నటిస్తున్న దిల్‌వాలే సినిమాలోని ఓ పాటకు సినిమాటోగ్రాఫర్‌గా చేయమని షార్‌ఖ్ సెంథిల్‌ను కోరడంతో దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈచిత్రంలో కేవలం ఒక పాటకు మాత్రమే చాన్స్ ఇచ్చిన షారుఖ్ ఆ పాటలో సెంథిల్ తన వర్క్‌తో అదరగొడితే ఇక తాను నటించే తదుపరి చిత్రానికి పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్ అవకాశం ఇవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఇక సెంధిల్ బాలీవుడ్‌లో బిజీ అయిపోతే ఆయన కేవలం రాజమౌళి చిత్రాలు తప్ప ఇతరుల చిత్రాలకు పనిచేసే అవకాశం, సమయం ఉండవంటున్నారు. మొత్తానికి త్వరలో సెంథిల్ దేశం గర్వించదగ్గ కెమెరామెన్‌గా ఎదగడం ఖాయం అని ఆయన సన్నిహితులు అంటున్నారు.