దగ్గుబాటి రానా దిశను, దశను బాహుబలి మలుపు తిప్పింది. హీరోయిజం కంటే విలనిజంను పండించడంలో రానా పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా త్వరలో తమిళంలో ఘనవిజయం సాధిస్తోన్న తని ఒరువన్ చిత్రాన్ని రామ్‌చరణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో పైకి మంచి వాడిగా కనిపించే విలన్‌గా వెటరన్ హీరో అరవింద్ స్వామి ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఆయన ఈ చిత్రం రీమేక్స్‌లో అదే పాత్ర పోషించడానికి సుముఖంగా లేనని స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ పాత్రకు మన దగ్గుబాటి రానా అయితే ఖచ్చితంగా సరిపోతాడని ఇండస్ట్రీ వర్గాలతో పాటు అందరూ భావిస్తున్నారు. సో.. ఈ విషయమై రానాతో చర్చలు కూడా జరుపుతున్నారు. మరి ఈ పాత్రకు రానా ఒప్పుకుంటే మాత్రం నిజ జీవితంతో ప్రాణస్నేహితులైన రామ్‌చరణ్, రానాల మధ్య ఆన్ ది స్క్రీన్ పెద్ద పోరాటమే జరుగుతుందని అంటున్నారు. మరి రానా ఫైనల్ డెసిషన్ ఏమిటో త్వరలో తెలియనుంది.