Advertisementt

కొరటాల తదుపరి చిత్రం ఖరారు..!

Thu 24th Sep 2015 05:34 AM
koratala siva,mahesh babu,sreemanthudu,ntr,nannaku prematho  కొరటాల తదుపరి చిత్రం ఖరారు..!
కొరటాల తదుపరి చిత్రం ఖరారు..!
Advertisement
Ads by CJ

మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుస ఘనవిజయాలను నమోదు చేసి టాలీవుడ్‌లో సంచలన దర్శకునిగా మారిన కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడు? అనే విషయంలో ఇప్పటివరకు సందిగ్దం కొనసాగుతోంది. కొరటాలతో తన తదుపరి చిత్రాన్ని ఒప్పించేందుకు ఎన్టీఆర్‌ ఓ వైపు నాన్నకు ప్రేమతో షూటింగ్‌కు లండన్‌లో గ్యాప్‌ ఇచ్చి, అదే పనిగా కొరటాలను కలిసి తన తదుపరిచిత్రం ఆయనే చేయాలని అడిగినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోపక్క మెగా ఫ్యామిలీ ఎలాగైన కొరటాల తదుపరి చిత్రాన్ని బన్నీతో చేయించాలని ప్లాన్‌ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు కొరటాల తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తోనే అని కన్‌ఫర్మ్‌ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్‌ మేకర్స్‌ సంస్థే ఎన్టీఆర్‌తో చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో చిత్రం పూర్తి అయి విడుదలైన తర్వాత అంటే వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. సో... ఈ విషయంలో ఎన్టీఆర్‌ కృషికి తగ్గ ఫలితమే వచ్చిందని చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ