వాస్తవానికి క్రిష్ దర్శకత్వంలో మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన కంచె చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజు రామ్ శివమ్ విడుదల కానుంది. వరుణ్‌తేజ్‌కు రామ్ పెద్ద పోటీ కాకపోయినప్పటికీ అక్టోబర్ 9న రుద్రమదేవి, ఆ తర్వాత బ్రూస్‌లీ, అఖిల్ వంటి పెద్ద చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. అందునా ఈ చిత్రం కోసం క్రిష్ 21కోట్లకు పైగా ఖర్చుపెట్టాడు. దీంతో అక్టోబర్ 2న కంచెను రిలీజ్ చేస్తే వారం రోజుల వరకు ఫర్వాలేదని, కానీ ఆ తర్వాత మాత్రం థియేటర్ల కొరత కారణంగా సినిమాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని మెగాఫ్యామిలీతో పాటు క్రిష్ కూడా ఆలోచనలో పడ్డాడు. దీంతో అందరూ వచ్చిన తర్వాత తీరిగ్గా అంటే దాదాపు నెల రోజుల గ్యాప్ తీసుకొని దీపావళి కానుకగా నవంబర్ 6న రావాలని డిసైడ్ అయ్యాడు. లేనిపోని పంతాలకు పోకుండా, వాయిదా వేయడం అవమానంగా భావించక .. ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్న క్రిష్ ఈ చిత్రం ద్వారా అవార్డులతో పాటు రివార్డులు కూడా కొడతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.