Advertisementt

శేఖర్‌కు మహేష్‌ అభయమిచ్చాడా..?

Thu 24th Sep 2015 05:16 AM
mahesh babu,sekhar kammula,brahmothsawam,sreekanth addaala  శేఖర్‌కు మహేష్‌ అభయమిచ్చాడా..?
శేఖర్‌కు మహేష్‌ అభయమిచ్చాడా..?
Advertisement
Ads by CJ

గతంలో మహేష్‌బాబు హీరోగా క్లాస్‌ చిత్రాల దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రానుందనే వార్తలు వచ్చాయి. అయితే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌, అనామిక చిత్రాల డిజాస్టర్‌ ఫలితాలతో శేఖర్‌ కమ్ములకు బ్యాడ్‌డేస్‌ మొదలయ్యాయి. దాంతో ఆ విషయమే అందరూ మర్చిపోయారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం శేఖర్‌ కమ్ముల ఈ గ్యాప్‌లో మహేష్‌బాబు కోసం తయారు చేసిన స్క్రిప్ట్‌కు మెరుగులుదిద్ది పూర్తి స్క్రిప్ట్‌ను తయారు చేశాడట. ఇటీవల తరచుగా శేఖర్‌కమ్ముల మహేష్‌ను కలుస్తున్నాడనేది వాస్తవం. ఇటీవలే ఆయన బ్రహ్మూెత్సవం చిత్రం షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లిన శేఖర్‌ కమ్ముల కొందరు జర్నలిస్ట్‌ల కంటపడ్డాడట. వాస్తవానికి శేఖర్‌ కమ్ముల మహేష్‌తో స్టోరీ డిస్కషన్స్‌కే అక్కడికి వెళ్లుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం క్లాస్‌ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో బ్రహ్మూెత్సవం చేస్తున్న మహేష్‌ వెంటనే మరో క్లాస్‌ సినిమా చేయకపోయిన్పటికీ త్వరలోనే శేఖర్‌కమ్ములతో సినిమా చేయడం మాత్రం గ్యారంటీ అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ