ఏ పాత్రనైనా అవలీలగా పోషించి అందులోకి పరకాయ ప్రవేశం చేసి, అందరినీ ఆకట్టుకునే నటుల్లో ప్రకాష్‌రాజ్ ఒకడు. ఆయన ఏదైనా పాత్ర చేస్తే ఆ పాత్రకు 100కి 200శాతం న్యాయం చేస్తాడు. అందుకే చాలామంది దర్శకనిర్మాతలే కాదు.. స్టార్‌హీరోలు సైతం ఆయన తమ సినిమాలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఇటీవల వరకు తమిళంలో కమల్‌హాసన్, త్రిషల కాంబినేషన్‌లో రూపొందుతున్న చీకటిరాజ్యంలో నటించి తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ప్రకాష్‌రాజ్‌ను తమ చిత్రంలో కీలకమైన పాత్ర చేయాల్సిందిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న కబాలి టీమ్ అడిగిందట. దానికి ప్రకాష్‌రాజ్ కూడా ఓకే చెప్పాడట. రజనీ సినిమా కావడంతో ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలని భావించాడట. అయితే కబాలి చిత్రానికిగాను ప్రకాష్‌రాజ్‌ను 60రోజుల బల్క్ కాల్షీట్స్ కావాలని దర్శకుడు కోరడంతో ఆయన ఈ సినిమా చేయాలా? లేక వదులుకోవాలా? అనే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే ఆయనకున్న టైట్ షెడ్యూల్‌లో ఓ చిత్రానికి ఏకంగా 60రోజుల కాల్షీట్స్ ఇవ్వడం జరిగే పని కాదని, వాస్తవానికి అన్ని రోజుల కాల్షీట్స్ ఇవ్వకుండా ఉంటే తాను మరో రెండుమూడు సినిమాలను ఈజీగా చేయగలనని ప్రకాష్‌రాజ్ భావిస్తున్నాడు. దీంతో కబాలి యూనిట్ ఈ విషయంలో సందిగ్దంలో పడిందని కోలీవుడ్ సమాచారం.