Advertisementt

ఆ మూడు సీక్వెల్స్‌పై భారీ ఆశలు..!

Wed 23rd Sep 2015 12:27 PM
bahubali the conclusion,robo2,shankar,sardhar gabbar singh  ఆ మూడు సీక్వెల్స్‌పై భారీ ఆశలు..!
ఆ మూడు సీక్వెల్స్‌పై భారీ ఆశలు..!
Advertisement
Ads by CJ

హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్‌ రావడం సహజమే. కాగా కథతో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ అదే టైటిల్‌ను రిపీట్‌ చేసి అదే టైప్‌ క్యారెక్టరైజేషన్‌తో నడిచే చిత్రాలను కూడా మనం సీక్వెల్స్‌గానే భావిస్తున్నాం. తాజాగా సౌత్‌ ఇండియాలోని తెలుగు, తమిళ భాషల్లో మూడు సీక్వెల్స్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న బాహుబలి.. ది కన్‌క్లూజన్‌ చిత్రం ఇప్పటినుండే ఇండియా అంతటా హీట్‌ పుట్టిస్తోంది. ఇక శంకర్‌, రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో వచ్చి సూపర్‌హిట్‌ అయిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రోబో2 తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీపొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌ నుండి సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్‌ సమాచారం. అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ హీరోగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన గబ్బర్‌సింగ్‌ కు సీక్వెల్‌గా తయారవుతున్న సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ పై కూడా బోలెడు అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి వీటిల్లో తమ మొదటి భాగాలను మించిన రీతిలో రూపొంది ప్రేక్షకులను అలరించే చిత్రాలుగా ఏవి నిలుస్తాయో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ