పలువురు తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్లుగా ముద్రపడిన వారికి సినిమాలలో వరుసపెట్టి చాన్స్‌లు వస్తున్నాయి. గతంలో సుమ, ఉదయభాను, ఝూన్సీ వంటి వారు సినిమాల్లో కూడా నటించారు. ఇక చిన్న వయసులోనే కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా అందరికీ పరిచయమైన కలర్స్ స్వాతి హీరోయిన్‌గా మారి టాలీవుడ్‌తో పాటు తమిళ , మలయాళ భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అనసూయతో పాటు రేష్మి వంటి యాంకర్లు చాలా సినిమాల్లో అవకాశాలు పొందుతున్నారు. బుల్లితెర అనుభవం ఉండటంతో పాటు బుల్లితెరపైనే హాట్ హాట్‌గా కనిపించే వీరిని సినిమాల్లో అయితే మరింత హాట్‌గా చూపించే అవకాశం ఉండటం... ఎక్కువగా టీవీ చానెల్స్ చూసే ఫ్యామిలీ ఆడియన్స్‌ను వీరు బాగా ఆకర్షిస్తుండటంతో వీరికి అవకాశాలు వెత్తుకొని వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ చిన్నారిపెళ్లికూతురు అవికాగోర్ ఓ మంచి ఎగ్జాంపుల్. మరి భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడే అమ్మాయిలకు బుల్లితెర ఓ నిచ్చెనగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.