మిర్చి సినిమా తరువాత కొరటాల శివ, మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. బాహుబలి వంటి పెద్ద హిట్ సినిమా తరువాత రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా మందిపై ప్రభావం చూపింది. కొందరు ఎన్నారైలు శ్రీమంతుడు సినిమా స్పూర్తితో కొన్ని విలేజెస్ ను కూడా అడాప్ట్ చేసుకున్నారు. 1(నేనొక్కడినే), ఆగడు సినిమాల ఫ్లాప్ లతో ఉన్న మహేష్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన కొరటాల శివ కు సర్ప్రైసింగ్ గా ఆడి ఏ6 మ్యాట్రిక్స్ కార్ ను ప్రెజెంట్ చేసాడు. మహేష్ ప్రత్యేకంగా ఆ కార్ నే గిఫ్ట్ గా ఇవ్వడానికి కారణం కూడా ఉందట. ప్రస్తుతం ఉన్న అన్ని కార్లలో ఆడి ఏ6 మంచి ఫీచర్స్ తో స్మూత్ గా ఉంటుందట. అందుకే స్పెషల్ గా మహేష్ ఆ కార్ నే ప్రజెంట్ చేసాడట.